'కోబ్రా' నుంచి మరో ట్రైలర్ రిలీజ్!

  • భారీ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'కోబ్రా' 
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న విక్రమ్ 
  • సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ 
  • ఈ నెల 31వ తేదీన సినిమా రిలీజ్   
Cobra movie triler released

విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు 'కోబ్రా' సినిమాను రూపొందించాడు. సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు.

యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్ క్రిందికి ఈ సినిమా వస్తుంది. విక్రమ్ ఇంతవరకూ చేస్తూ వచ్చిన డిఫరెంట్ రోల్స్ లో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారనే విషయం అర్థమవుతోంది. దాదాపు విదేశాల్లోనే షూటింగ్ జరిగిందనే విషయం ట్రైలర్ ను బట్టి స్పష్టమవుతోంది.

విక్రమ్ సరసన నాయికగా శ్రీనిధి శెట్టి అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఇర్ఫాన్ పఠాన్ .. మియా జార్జ్ .. మృణాలిని రవి .. కనిక కనిపించనున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. చాలాకాలంగా విక్రమ్ ఎదురుచూస్తున్న హిట్, ఈ సినిమాతో లభిస్తుందేమో చూడాలి.

More Telugu News