ఏపీ విభజన అంశాలపై రేపు కేంద్ర ఆర్థిక శాఖ కీలక భేటీ... హాజరుకానున్న బుగ్గన, సాయిరెడ్డి
- ఇటీవలే ప్రధానిని కలిసిన సీఎం
- ఏపీ సమస్యలను ఏకరువు పెట్టిన జగన్
- సమస్యల పరిష్కార బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శికి అప్పగించిన మోదీ
- రేపు ఏపీ ప్రతినిధి బృందంతో భేటీ కానున్న సోమనాథన్
ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం సవరించిన అంచనాలు, రాష్ట్ర లోటు బడ్జెట్‌ను భర్తీ చేసే అంశం తదితరాలపై ప్రధానికి ఆయన ఓ వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన మోదీ... కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిని పిలిచి ఈ వ్యవహారాలను పరిష్కరించాలని సూచించారట. ప్రధాని ఆదేశాల నేపథ్యంలో సోమనాథన్ గురువారం కీలక భేటీని నిర్వహిస్తున్నట్లు సమాచారం.