దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ
- హర్యానాలోని ఫరీదాబాద్ లో అమృత హాస్పిటల్ ప్రారంభం
- గత ఆరేళ్లుగా నిర్మాణం
- సహాయసహకారాలు అందించిన మాతా అమృతానందమయి మఠం
- అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రి
ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో వైద్యరంగం, ఆధ్యాత్మికతల మధ్య ఎంతో సామీప్యత ఉందని తెలిపారు. అందుకు కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సరైన ఉదాహరణ అని, ప్రపంచంలోనే అతి భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఆధ్యాత్మిక-ప్రైవేటు భాగస్వామ్యంలో జరిగిన అవగాహన ప్రచారం సత్ఫలితాలను ఇచ్చిందని వివరించారు.
కాగా, అమృత హాస్పిటల్ ను 130 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో పరిశోధనల కోసం ఏడు అంతస్తులతో భవనాన్ని నిర్మించారు. ఇందులో 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ విభాగం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ ఆసుపత్రి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు చేపట్టనుంది. ఇందులో మొత్తం 14 అంతస్తులున్నాయి. ఆసుపత్రి పైభాగంలో హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు.
.