Nagashourya: నాగశౌర్య సినిమాకి రిలీజ్ డేట్ ఖరారు!

Krishna Vrinda Vihari release date confirmed
షార్ట్స్‌లో చూడండి
నాగశౌర్య హీరోగా అనీశ్ కృష్ణ దర్శకత్వంలో 'కృష్ణ వ్రింద విహారి' సినిమా రూపొందింది. ఇది ప్రేమకథ ప్రధానంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. నాగశౌర్య సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాతో తెలుగు తెరకి షిర్లే సెటియా కథానాయికగా పరిచయమవుతోంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. 

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ సినిమాను సెప్టెంబర్  23వ తేదీన విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాధిక ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించారు. ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. 

క్రితం ఏడాది నాగశౌర్య నుంచి వచ్చిన 'లక్ష్య' .. 'వరుడు కావలెను' సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ ఏడాదిలో నాగశౌర్య నుంచి వస్తున్న ఫస్టు మూవీ ఇదే. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Go Back to Shorts
Nagashourya
Shirle Setiya
Anish Krishna
Krishna Vrinda Vihari Movie

More Telugu News