'నా ఆరాధ్య దైవం చంద్రబాబు గారితో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది'.. అంటూ ఫొటో పోస్ట్ చేసిన యువనేత!
- కుప్పంలో 3 రోజుల పాటు చంద్రబాబు టూర్
- హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరు చేరిన చంద్రబాబు
- చంద్రబాబు పక్కనే కూర్చుని ప్రయాణించిన యువ నేత శిష్ట్లా లోహిత్
- చంద్రబాబు నాయకత్వాన్ని ఆకాశానికెత్తుతూ ట్వీట్
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు అంటే తనకు ఎంత ఇష్టమో చెబుతూ లోహిత్ ఓ ట్వీట్ పోస్ట్ చేశాడు. 'కుప్పం పర్యటనకు బయల్దేరిన నా ఆరాధ్య దైవం టీడీపీ అధినేత చంద్రబాబు గారితో కలిసి ప్రయాణించడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేసిన జగన్ రెడ్డి పాలనను గద్దె దింపడానికి బాబు గారు చేస్తున్న పోరాటంలో నేను సైతం కలిసి పోరాడటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది' అంటూ శిష్ట్లా లోహిత్ పేర్కొన్నాడు.