Team India: కేఎల్ రాహుల్, అతియా పెళ్లిపై చిన్న ట్విస్ట్ ఇచ్చిన సునీల్ శెట్టి

Suniel Shetty confirms Athiya Shetty and KL Rahul wedding But there is a twist
  • ఇద్దరి పెళ్లి జరుగుతుందన్న బాలీవుడ్ నటుడు
  • కానీ, రాహుల్ కు విరామం దొరకడం లేదని వ్యాఖ్య
  • తగినంత విరామం దొరికినప్పుడే ప్లాన్ చేస్తామని వివరణ  
టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి ప్రేమలో ఉన్నారు. చాన్నాళ్లుగా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు అయిన అతియాతో రాహుల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఈ విషయంపై సునీల్ శెట్టి స్పందించారు. ఈ ఇద్దరి పెళ్లి జరుగుతుందని, కానీ, అది ఇప్పట్లో కాదని ట్విస్ట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్ పర్యటనలతో నిండిన బిజీ షెడ్యూల్‌లో ఉన్నాడని, పెళ్లి చేసుకోవడానికి ఖాళీ సమయం లేదని చెప్పారు.
 
‘పిల్లలు నిర్ణయించిన వెంటనే పెళ్లి జరుగుతుంది. కానీ, రాహుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆసియా కప్, వరల్డ్ కప్, సౌతాఫ్రికా టూర్, ఆస్ట్రేలియా టూర్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరికి విరామం దొరికినప్పుడు మాత్రమే పెళ్లి జరుగుతుంది. ఒక్క రోజు విరామం లభిస్తే పెళ్లి చేసేయలేం కదా. ఒక తండ్రిగా మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నా. కానీ అది జరగాలంటే రాహుల్‌కి విరామం కావాలి. అతని షెడ్యూల్ చూస్తే మీరు భయపడతారు. ఏడాదిలో కేవలం 12 రోజుల విరామం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో పెళ్లి చేయడం కష్టం. కాబట్టి తగినంత సమయం లభించినప్పుడు ప్లాన్ చేస్తాం’ అని సునీల్ చెప్పుకొచ్చారు. 

రాహుల్, అతియా మూడేళ్లకు పైగా డేటింగ్ లో ఉన్నారు. మూడు నెలల్లో వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతారని వార్తలు వచ్చినా.. సునీల్ చెబుతున్న దాని ప్రకారం ఈ ఏడాదిలో సాధ్యమయ్యేలా లేదు. కాగా, రాహుల్ తల్లిదండ్రులు ఇటీవల అతియా కుటుంబాన్ని కలవడానికి ముంబైకి వచ్చారు. పెళ్లి తర్వాత రాహుల్, అతియా ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారు.
Team India
kl rahul
athiya shetty
wedding
sunil shetty

More Telugu News