Ram Gopal Varma: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సీన్ చూస్తున్నప్పుడు.. నాకు జెమిని సర్కస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది: రామ్ గోపాల్ వర్మ

RRR movie looked like a circus for me says Ram Gopal Varma
  • 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక సర్కస్ లా అనిపించిందన్న వర్మ 
  • వోడ్కాలోకి పల్లీలను స్టఫ్ గా తీసుకోవడాన్ని ఇష్టపడతానని వెల్లడి 
  • మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని కామెంట్ 
దేశ వ్యాప్తంగా ఘనజయాన్ని సాధించిన 'ఆర్ఆర్ఆర్'పై వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఒక సర్కలా అనిపించిందని అన్నారు. సర్కస్ చూస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో... ఈ సినిమాలో వంతెన దగ్గర పిల్లాడిని కాపాడే సీన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా జెమినీ సర్కస్ చేస్తున్న ఫీలింగ్ తనకు కలిగిందని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా వర్మ కోరడం గమనార్హం. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి జోష్ కలుగుతుందో అలాంటిదే ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిందని అన్నారు. ఒక సినిమా మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 

కాలేజీ రోజుల్లో తనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేదని వర్మ తెలిపారు. అయితే అయాన్ ర్యాండ్ పుస్తకాలను చదవడాన్ని ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి తనలో మార్పు వచ్చిందని చెప్పారు. తాను తనతో సహా ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోనని అన్నారు. వోడ్కాలోకి పల్లీలను స్టఫ్ గా తీసుకోవడాన్ని ఇష్టపడతానని చెప్పారు. తన కెరీర్ లో కేవలం 'క్షణక్షణం', 'సర్కార్' సినిమాలను మాత్రమే పక్కా స్క్రిప్ట్, దానికి సరిగ్గా సరిపోయే నటులతో తీశానని... మిగిలిన సినిమాలేవీ కూడా ఫలానా నటుడితో చేయాలనుకుని చేయలేదని అన్నారు. 

తెరపై అమ్మాయిలను తనకంటే అందంగా ఎవరూ చూపించలేరని వర్మ చెప్పారు. మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని స్పష్టం చేశారు. ఒకసారి తామిద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నామని... ఆయన తన మాట వినలేదని, తాను ఆయన మాట వినలేదని చెప్పారు.
Ram Gopal Varma
RRR
Junior NTR
Ramcharan
Circus
Maniratnam
Vodka

More Telugu News