తెలంగాణలో తాజాగా 345 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 23,780 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 146 మందికి పాజిటివ్
- కరోనా నుంచి కోలుకున్న 265 మంది
- ఇంకా 2,752 మందికి చికిత్స
- తాజా మరణాలు నిల్
తెలంగాణలో ఇప్పటివరకు 8,32,219 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,25,356 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,752 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.
