YSRCP: మోదీతో భేటీ త‌ర్వాత.. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్‌, రాష్ట్రప‌తిల‌తో జ‌గ‌న్ స‌మావేశం

ap cm ys jagan meets pm modi and union minister rk singh and wished president murmu
  • మోదీతో అర‌గంట పాటు జ‌గ‌న్ భేటీ
  • కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో జ‌గ‌న్ స‌మావేశం
  • తెలంగాణ నుంచి విద్యుత్ బ‌కాయిలు ఇప్పించాల‌ని విన‌తి
  • రాష్ట్రప‌తి ముర్ముకు అభినంద‌న‌లు తెలిపిన జ‌గ‌న్‌
దేశ రాజ‌ధాని ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం నుంచి బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయిన జ‌గ‌న్‌... రాష్ట్రానికి చెందిన ప‌లు అంశాల‌పై సుమారు అర‌గంట పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆ త‌ర్వాత ప్ర‌ధాని నివాసం నుంచే నేరుగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వ‌ద్ద‌కు జ‌గ‌న్ వెళ్లారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రాల‌పై కేంద్ర మంత్రితో చ‌ర్చించిన జ‌గ‌న్‌.. తెలంగాణ నుంచి త‌మ‌కు రావాల్సిన విద్యుత్ బ‌కాయిలు ఇప్పించాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం.

ఆర్కే సింగ్ తో భేటీ త‌ర్వాత సోమ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు జ‌గ‌న్ చేరుకున్నారు. ఇటీవ‌లే ముగిసిన రాష్ట్రప‌తి ఎన్నికల్లో విజ‌యం సాధించి భారత రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద్రౌప‌ది ముర్ముకు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ముర్ముకు వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రప‌తిగా ముర్ము ప్ర‌మాణం చేశాక..తొలిసారిగా ఢిల్లీకి వెళ్లిన జ‌గ‌న్ మ‌ర్యాద‌పూర్వ‌కంగానే ఆమెతో భేటీ అయ్యారు.
YSRCP
YS Jagan
Andhra Pradesh
Prime Minister
Narendra Modi
Draupadi Murmu
RK Singh

More Telugu News