Jagan: ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్

  • పోలవరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించిన జగన్
  • మధ్యాహ్నం భారత రాష్ట్రపతిని కలవనున్న ముఖ్యమంత్రి
  • అనంతరం పులువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం
Jagan meets PM Modi

ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఢిల్లీకి వెళ్లిన జగన్ ప్రధానిని కలిసి పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని జగన్ ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పోలవరం నిర్వాసితులకు పునరావాస కల్పన, పెండింగ్ బిల్లుల మంజూరు అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని ప్రధాని కోరినట్టు సమాచారం. కాసేపటి క్రితం ప్రధానితో ఆయన సమావేశం ముగిసింది. 

మరోవైపు మధ్యాహ్నం 1.30 గంటలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అనంతరం కేంద్ర విత్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ కానున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ను కూడా కలవబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మరోవైపు మోదీతో భేటీ సమయంలో జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.

More Telugu News