Corona Virus: తెలంగాణలో తాజాగా 252 మందికి కరోనా పాజిటివ్

252 people are corona positive in Telangana
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 17,029 కరోనా పరీక్షలు నిర్వహించగా, 252 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 143 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 16, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. మరో 175 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,31,874 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,25,091 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,672 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మరణించారు.
Corona Virus
Telangana

More Telugu News