మునుగోడులో కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతాం: బండి సంజయ్
- కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందన్న సంజయ్
- అందుకే ఏం మాట్లాడుతున్నారో తెలియకుండానే ప్రసంగించారని ఎద్దేవా
- మునుగోడులో కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతామని వెల్లడి
కేసీఆర్‌కు ప్రస్తుతం మునుగోడు భయం పట్టుకుందని బండి సంజయ్ అన్నారు. ఈ కారణంగానే శనివారం నాటి మునుగోడు సభలో తానేం మాట్లాడుతున్నానన్న విషయాన్ని మరచి కేసీఆర్ ప్రసంగించారని ఎద్దేవా చేశారు. మరికాసేపట్లో మునుగోడులో బీజేపీ సభ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించేందుకే ఈ సభ జరుగుతున్న విషయం విదితమే. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు.