Telangana: మంత్రి పువ్వాడ అజ‌య్ కుమారుడి వివాహానికి హాజ‌రైన కేసీఆర్‌...ఫొటో ఇదిగో

ts cmkcr attends minister puvvada ajay son marriage
  • హైద‌రాబాద్‌లో వేడుక‌గా జ‌రిగిన వివాహం
  • హాజ‌రైన కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన పువ్వాడ‌
  • జ‌గ‌న్‌నూ ఆహ్వానించిన పువ్వాడ అజ‌య్ దంప‌తులు
తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ కుమారుడి వివాహం శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత వేడుక‌గా జ‌రిగింది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు సీఎం కేసీఆర్ స్వ‌యంగా హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. త‌న కుమారుడి వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

త‌న కుమారుడి వివాహం నిశ్చ‌యమైన వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను పువ్వాడ అజ‌య్‌ ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కూడా అజ‌య్ దంప‌తులు ఆహ్వానించారు.
Telangana
TRS
Puvvada Ajay Kumar
KCR
Hyderabad
Marriage
YS Jagan

More Telugu News