పాద‌యాత్ర‌లో 1,700 కిలో మీట‌ర్లు పూర్తి చేసిన వైఎస్ ష‌ర్మిల‌... ఇవిగో ఫొటోలు

20-08-2022 Sat 19:21
  • ప్ర‌జా ప్రస్థానం పేరిట వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌
  • మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్‌లో 1,700 కిలోమీట‌ర్లకు చేరిన యాత్ర‌
  • ప్ర‌జ‌ల అండ‌దండ‌ల‌తోనే ఈ మేర విజ‌యం సాధించాన‌న్న ష‌ర్మిల‌
ys sharmila padayatra crosses 1700 kilometers mile stone
ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో కొనసాగిస్తున్న పాద‌యాత్ర శ‌నివారం ఓ కీల‌క మైలు రాయిని చేరుకుంది. త‌ర‌చూ విరామాల‌తో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌లో ష‌ర్మిల శ‌నివారం నాటికి 1,700 కిలో మీట‌ర్ల మేర న‌డిచారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్‌లో ఆమె ఈ మైలురాయిని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్టీపీ శ్రేణులు ఘ‌నంగా వేడుక‌లు జ‌రుపుకున్నారు.

త‌న పాద‌యాత్ర 1,700 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకున్న ష‌ర్మిల‌... ప్రజల అండదండలతో ప్రజాప్రస్థానం 1,700 కిలోమీట‌ర్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు. పాదయాత్రలో త‌న‌ వెన్నంటి నడుస్తున్న ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. మాట మీద నిలబడే వైఎస్సార్‌ నాయకత్వాన్ని తెలంగాణలో తిరిగి తీసుకొస్తామ‌ని ప్ర‌తిన‌బూనిన ష‌ర్మిల‌... వైఎస్సార్‌ సంక్షేమ పాలన ప్రజలకు చూపిస్తామ‌ని తెలిపారు.