బాలికపై బోయ్ ఫ్రెండ్స్ తో అత్యాచారం చేయించిన ముంబై మహిళ

Mumbai woman gets 3 men to rape 11 year old Girl
  • సెల్ ఫోన్ రిపేర్ షాపునకు వెళ్లిన 11 ఏళ్ల బాలిక
  • ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువతి
  • ముగ్గురు మగ స్నేహితులకు కబురు
  • ఆ తర్వాత బాలికపై సామూహిక అత్యాచారం
సమాజంలోని మోసాలు, కుళ్లు గురించి పెద్దగా తెలియని వయసు ఆ బాలికది. ఆమె వయసు 11 ఏళ్లు. తెలియనితనంతో కామాంధుల చేతికి చిక్కి లైంగిక దాడికి గురైంది. ఈ కథంతా నడిపింది ఆ బాలికకు స్నేహితురాలైన 21 ఏళ్ల యువతి కావడం గమనార్హం. ఈ ఘటన ముంబైలో జరిగింది. ఈ నెల 17న తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం వివరాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. 

అంతకుముందు రోజు సాయంత్రం 7 గంటల సమయంలో బాలిక తన ఇంటికి సమీపంలోని సెల్ ఫోన్ రిపేర్ షాపునకు వెళ్లింది. అక్కడే ఆమెకు 21 ఏళ్ల స్నేహితురాలు కనిపించింది. ఏం మాటలు చెప్పిందో కానీ, ఆ బాలికను తనతోపాటు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. తన ముగ్గురు మగ స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని కబురు పెట్టింది.

అర్ధరాత్రి సమయంలో పాండల్ సమీప ప్రాంతానికి వారు చేరుకున్నారు. ముగ్గురిలో ఒకరితో శృంగారంలో పాల్గొనాలంటూ బాలికను యువతి బెదిరించింది. వారిలో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అందరూ కలసి బాలికను ఆమె ఇంటి ముందు దిగబెట్టి వెళ్లిపోయారు. తనకు జరిగిన దారుణం గురించి బాలిక ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక తల్లి విహార్ పోలీసులను ఆశ్రయించింది. 

పోలీసులు మూడు గంటల్లోనే యువతితోపాటు, మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. మరో వ్యక్తి కూరగాయల విక్రేత అని తేలింది. మరో నిందితుడుని డ్రగ్స్ డీలర్ గా అనుమానిస్తున్నారు. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది.
Go Back to Shorts
mumbai
gang rape
3 men
women traped

More Telugu News