పార్టీ మార్పు తప్పనిసరి.. టీడీపీకి రాజీనామా చేస్తా: కొత్తకోట దయాకర్‌రెడ్డి
- పుట్టిన రోజు సందర్భంగా దేవరకద్రలో కార్యకర్తలతో సమావేశం
- టీడీపీని వీడుతానంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న దయాకర్‌రెడ్డి
- కార్యకర్తలు సూచించిన పార్టీలోకి వెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే
అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పార్టీని వీడక తప్పడం లేదని దయాకర్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా దేవరకద్రలో భార్య సీతతో కలిసి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీ మార్పు తప్పనిసరి అని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యకర్తలు సూచించిన పార్టీలోకి వెళతానని పేర్కొన్నారు.