Boris Johnson: రేసులో లేరు కానీ.. ఉంటే మళ్లీ బోరిస్ జాన్సనే ప్రధాని!

  • ‘స్కూ న్యూస్’ కోసం యూగవ్ సర్వే
  • 46 శాతం మంది మద్దతు బోరిస్‌కే
  • రాజీనామా కోసం ఒత్తిడి చేశామన్న 55 శాతం మంది
  • సర్వేలన్నీ లిజ్ ట్రస్‌కే అనుకూలం
Tory members still prefer Johnson

బ్రిటన్ ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్ లేరు కానీ, ఉండి ఉంటే ఆయనకే మళ్లీ ప్రధాని పీఠం దక్కి ఉండేది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువమంది బోరిస్‌నే కోరుకుంటున్నట్టు ‘స్కై న్యూస్’ కోసం నిర్వహించిన యూగవ్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 

జాన్సన్‌ కనుక పోటీలో ఉండి ఉంటే 46 శాతం ఓట్లు ఆయనకే వచ్చి ఉండేవని ఇందులో వెల్లడైంది. అప్పుడు విదేశాంగమంత్రి లిజ్ ట్రస్‌కు 24 శాతం, సునాక్‌కు 23 శాతం ఓట్లు మాత్రమే వచ్చేవని వెల్లడించింది. అంతేకాదు, బోరిస్ రాజీనామా కోసం ఒత్తిడి తీసుకొచ్చి తప్పు చేశారని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవికి అభ్యర్థిని తేల్చేందుకు ఓటు వేసే అర్హత ఉన్న 1,089 మంది పార్టీ సభ్యులతో ఈ నెల 12-17 మధ్య నిర్వహించిన యూగవ్ సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి.

ఇక, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, భారత సంతతికి చెందిన రిషి సునాక్ మధ్య జరుగుతున్న పోరులో ట్రస్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు యూగవ్ తాజా సర్వే తేల్చింది. అంతకుముందు కన్జర్వేటివ్ పార్టీ సొంత సర్వేలోనూ ఇలాంటి ఫలితమే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్‌ను ఓడించే సత్తా జాన్సన్‌కు మాత్రమే ఉందని అత్యధికమంది కన్జర్వేటివ్ సభ్యులు భావిస్తున్నారు. కాగా, సర్వేలన్నీ ట్రస్‌కే అనుకూలంగా ఉండడం గమనార్హం.

More Telugu News