Gotabaya Rajapaksa: శ్రీలంకకు తిరుగు టపా.. స్వదేశం వచ్చేందుకు గొటబాయ రెడీ

Gotabaya Rajapaksa to return to Sri Lanka on August 24
  • ప్రజాగ్రహంతో శ్రీలంక విడిచి పరారైన గొటబాయ
  • ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్న మాజీ అధ్యక్షుడు
  • 24న వచ్చేస్తానంటూ కుటుంబ సభ్యుడికి ఫోన్
ప్రజాగ్రహంతో దేశం విడిచి పరారైన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి స్వదేశానికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. లక్షలాదిమంది ప్రజలు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో దేశం విడిచి తొలుత మాల్దీవులకు వెళ్లిపోయిన గొటబాయ అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్లు ఉన్న తర్వాత వీసా గడువు ముగియడంతో అక్కడి నుంచి చార్టర్డ్ విమానంలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు. 

ప్రస్తుతం అక్కడ ఓ హోటల్‌లో ఉంటున్న గొటబాయ మరో దేశానికి వెళ్తారని భావించినప్పటికీ ఇప్పుడు స్వదేశానికే తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రష్యాలో శ్రీలంక రాయబారిగా గతంలో పనిచేసిన ఆయన మేనల్లుడు ఉదయంగ వీరతుంగకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ నెల 24న ఆయన శ్రీలంక రాబోతున్నారని గొటబాయ తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎలాంటి పదవులు చేపట్టబోరన్నారు. రాజకీయంగా ఎన్నిక కాకుండానే ఆయన దేశానికి సేవ చేస్తారని వీరతుంగ తెలిపారు.
Gotabaya Rajapaksa
Bangkok
Sri Lanka

More Telugu News