hero nani: ఆస్కార్ బరిలో నాని సినిమా!

Nani Movie Shyam SinghaRoy sent for Oscar Nominations in 3 Categories
  • ఆస్కార్ నామినేషన్లకు  ‘శ్యామ్ సింగరాయ్’
  • మూడు విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశం
  • పునర్జన్మల నేపథ్యంలో సాగే చిత్రం 
తెలుగు చిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా హీరో నాని అభిమానులకు శుభవార్త. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆస్కార్ నామినేషన్ల రేసులో ఈ చిత్రం నిలిచింది. నాని ద్విపాత్రాభినయం చేసిన చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ మూడు విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీరియాడిక్ డ్రామా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ పరిశీలనలో ఉంది.
 
పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో భారత దేశంలోని దేవదాసి దురాచారంపై పోరాడే కథానాయకుడి పాత్రతో నాని మెప్పించాడు. అలాగే, దేవదాసిగా సాయి పల్లవి నటన కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ క్లిష్టమైన సబ్జెక్టును బాగా డీల్ చేశాడు. హైదరాబాద్, కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచాడు. 

గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. మిక్కీ జే మేయర్ అందించిన స్వరాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి ప్లస్ అయింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన  ‘శ్యామ్ సింగరాయ్’  హయ్యెస్ట్ రేటింగ్ సాధించింది. అలాగే, పది వారాల పాటు  టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.
hero nani
Tollywood
oscar
naminations
Shyam SinghaRoy

More Telugu News