Bandi Sanjay: బండి సంజయ్ కు సవాల్ విసురుతూ జనగామలో పోస్టర్లు

TRS flexis against Bandi Sanjay in Janagama
  • నేడు జనగామ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న బండి సంజయ్ పాదయాత్ర
  • పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు
  • నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను తీసుకొచ్చిన తర్వాతే జనగామలో అడుగు పెట్టాలంటూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు
జనగామలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతోంది. రెండు పార్టీలు పోటీపోటీగా ఫ్లెక్సీలు, ప్రచార హోర్డింగ్స్ ను ఏర్పాటు చేశాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాలు విసురుతూ టీఆర్ఎస్ శ్రేణులు వీటిని ఏర్పాటు చేశాయి. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులను తీసుకొచ్చిన తర్వాతే జనగామలో అడుగు పెట్టాలని ఫ్లెక్సీల్లో టీఆర్ఎస్ పేర్కొంది. ఈ ఫ్లెక్సీలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఏర్పాటు చేశారు. మరోవైపు, బండి సంజయ్ కి స్వాగతం పలుకుతూ బీజేపీ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే బీజేపీ ఫ్లెక్సీలను కొందరు చించేయడంతో... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు జనగామ నియోజకవర్గంలోకి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోనుంది.
Bandi Sanjay
BJP
TRS
Flexi

More Telugu News