ఈ నెల 20వ తేదీన కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

16-08-2022 Tue 21:33
  • రాష్ట్రంలో కౌలు రైతుల బలవన్మరణాలు
  • కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న పవన్
  • శనివారం ఉమ్మడి కడప జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర
Pawan Kalyan will visit Kadapa district on August 20
ఏపీలో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేస్తారు. 

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారు.