ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ చిత్రాలను మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ2'
- నాలుగు రోజుల్లోనే రూ. 25 కోట్లు రాబట్టిన నిఖిల్ చిత్రం
- హిందీలోనూ ఆకట్టుకుంటున్న వైనం
- గణనీయంగా పెరిగిన థియేటర్ల సంఖ్య
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో కూడా ఆకట్టుకుంటోంది. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షర్ కుమార్ ‘రక్షా బంధన్’ చిత్రాలను మించిన కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ ను ఆశ్చర్యపరిచింది. హిందీలో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు స్ర్కీన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో నాలుగో రోజున కార్తికేయ సుమారు 4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ ఇప్పటికే రూ. 25 కోట్ల మార్కు దాటాయి. దాంతో, ఈ ఏడాది టాలీవుడ్‌లో కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.