టైమ్స్ నౌ సర్వేలోనూ వైసీపీ హవానే!

16-08-2022 Tue 14:13
  • ఆగస్టు 15 వరకు సర్వే చేపట్టిన టైమ్స్ నౌ
  • ఏపీలో వైసీపీకి 17 నుంచి 23 ఎంపీ స్థానాలు
  • దేశంలో బెస్ట్ సీఎంలలో జగన్ కు ఐదోస్థానం
  • ఇటీవల వచ్చిన అన్ని సర్వేల్లో వైసీపీకే మొగ్గు
Times Now Survey says YCP gets better votes than other parties in AP
ఏపీలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ తన ప్రభావం చూపించడం ఖాయమని మరో సర్వే చెబుతోంది. ఇటీవలే ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వైసీపీ అనుకూల ఫలితాలు రాగా, తాజాగా టైమ్స్ నౌ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలోనూ జగన్ హవా స్పష్టమైంది. 

ఆగస్టు 15 వరకు టైమ్స్ నౌ జరిపిన సర్వే ప్రకారం.... ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ 17 నుంచి 23 సీట్లు గెలుచుకుంటుంది. ఇటీవల వచ్చిన ఇండియా టుడే సర్వేలో వైసీపీకి 18 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. ఇండియా టీవీ సర్వే ప్రకారం వైసీపీకి 19 ఎంపీ స్థానాలు వస్తాయని వెల్లడించారు. దేశంలో ది బెస్ట్ సీఎంలలో వైఎస్ జగన్ ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, టైమ్స్ నౌ తెలంగాణలో నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు 6 నుంచి 10 ఎంపీ స్థానాలు వస్తాయని వివరించారు.