Tollywood: ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ చిత్రాలను మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 'కార్తికేయ2'

Kartikeya2 Dominates Aamir Khans Laal Singh Chaddha at Box Office
  • నాలుగు రోజుల్లోనే  రూ. 25 కోట్లు రాబట్టిన నిఖిల్ చిత్రం
  • హిందీలోనూ ఆకట్టుకుంటున్న వైనం
  • గణనీయంగా పెరిగిన థియేటర్ల సంఖ్య
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కార్తికేయ 2’ బాక్సాఫీస్  ను షేక్ చేస్తోంది. తొలిసారి తెలుగుతో పాటు హిందీ, ఇతర భాషల్లో విడుదలైన ఈ చిత్రం వసూళ్లలో రికార్డులను బద్దలు కొడుతోంది. తొలుత తక్కువ థియేటర్లలోనే విడుదలైనప్పటికీ మంచి హిట్ టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. డిమాండ్ దృష్ట్యా కొన్ని సెంటర్స్ లో ఎక్స్ ట్రా షోలను కూడా వేస్తున్నారు. రాఖీ, పంద్రాగస్టు సెలవులతో కూడిన తొలివారంలో ఈ చిత్రం మంచి బిజినెస్ చేసింది. 

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీలో కూడా ఆకట్టుకుంటోంది. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షర్ కుమార్ ‘రక్షా బంధన్’ చిత్రాలను మించిన కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ ను ఆశ్చర్యపరిచింది. హిందీలో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ఇప్పుడు స్ర్కీన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో నాలుగో రోజున కార్తికేయ సుమారు 4 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ ఇప్పటికే రూ. 25 కోట్ల మార్కు దాటాయి. దాంతో, ఈ ఏడాది టాలీవుడ్‌లో కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Tollywood
Bollywood
karthikeya2
collections
25cr
Aamir Khan
akshay kumar
nikhil

More Telugu News