భారత్ లో రెండు ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసిన శామ్ సంగ్
- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4 విడుదల
- హెచ్ డీఎఫ్ సీ కార్డులపై 10 శాతం తగ్గింపు
- వీటి కొనుగోలుపై రూ.2,999కే గెలాక్సీ వాచ్ 4 లభిస్తుంది.
జెడ్ ఫ్లిప్ 4 లో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ రకాలు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.89,999, రూ.94,9999. ఇందులోనే బీస్పోక్ ఎడిషన్ ధర రూ.97,999. బోరా పర్పుల్, గ్రాఫైట్, పింక్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4లో 12జీబీ, 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్, ఒక టీబీ ర్యామ్ తో వస్తుంది. వీటిల్లో ఆరంభం మోడల్ ధర రూ.`54,999 అయితే, టాప్ మోడల్ ధర రూ.1,84,999. గ్రే గ్రీన్, బీజ్, పాంథాన్ బ్లాక్ అనే మూడు రకాల్లో ఇది లభిస్తుంది.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కొనుగోలు చేసే వారికి.. గెలాక్సీ వాచ్ 4 ను రూ.2,999కే అందిస్తానంటోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులపై రూ.8,000 డిస్కౌంట్ ఇస్తోంది.