Airtel: ఎయిర్ టెల్ నుంచి రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

Airtel launches 2 new prepaid plans with unlimited voice calls
  • రెండు నెలల వ్యాలిడిటీతో రూ.519
  • 90 రోజుల వ్యాలిడిటీతో రూ.779 ప్లాన్
  • రీచార్జ్ చేసుకుంటే ఇతర వర్తకుల వద్ద డిస్కౌంట్ ఆఫర్
భారతీ ఎయిర్ టెల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో పలు ప్లాన్లను ఎప్పుడో విడుదల చేసింది. ఎయిర్ టెల్ కాస్త ఆలస్యంగా ఇదే బాటలో నడిచింది. 

రూ.519
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు. రోజూ ఒకటిన్నర జీబీ చొప్పున రెండు నెలల్లో 90 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. పలు ఇతర ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

రూ.779
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 135 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్ లు కూడా వర్తిస్తాయి.

ఇతర ప్లాన్లు
భారతీ ఎయిర్ టెల్ ఇప్పటికే 1.5 జీబీ డేటాతో రెండు రకాల ప్యాక్ లను అందిస్తోంది. అవి రూ.299. రూ.479. రూ.299 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ, ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. రూ.479 ప్లాన్ వ్యాలిడిటీ రూ.56 రోజులు. 

Airtel
launches
prepaid plans
new
planes

More Telugu News