ఆసుపత్రి బెడ్ పై ఉన్న వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి... వీడియో ఇదిగో!

15-08-2022 Mon 21:46
  • ఆసుపత్రిపాలైన చిరంజీవి అభిమాని చక్రీధర్
  • విషయం తెలుసుకున్న చిరంజీవి
  • అభిమాని ముఖంలో సంతోషం నింపిన వైనం
Chiranjeevi met fan who is in hospital
మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ఓ అభిమాని ముఖంలో కాంతులు నింపారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న చక్రీధర్ అనే యువకుడ్ని చిరంజీవి స్వయంగా కలిశారు. అతడితో మాట్లాడి ఉత్సాహం కలిగించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, అనంతరం ఆసుపత్రికి వెళ్లారు. చక్రీధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి వైద్యులతో మాట్లాడారు. చక్రీధర్ పెడన చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.