Road Accident: గుంటూరు జిల్లాలో రహదారి రక్తదాహం... నలుగురు విద్యార్థుల బలి

Four students died in road accident in Guntur district
  • ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు
  • కారులో ఆర్కిటెక్చర్ విద్యార్థులు
  • విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా ఘటన
  • ముగ్గురు అక్కడికక్కడే మృతి
రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జరిగింది. విద్యార్థులు కారులో విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గౌతమ్ రెడ్డి (విజయవాడ), చైతన్య పవన్ (కాకినాడ), సౌమ్యిక (విశాఖ) అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. వీరందరూ ఆర్కిటెక్చర్ విద్యార్థులని పోలీసులు తెలిపారు. కారు వేగంగా వస్తుండడంతో ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. కారు ముందు భాగం లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది.
Road Accident
Students
Thummalapalem
Guntur District

More Telugu News