దైవదూషణకు పాల్పడిన నుపుర్ శర్మకు తగిన బుద్ధి చెప్పండి: భారత ముస్లింలకు పిలుపునిచ్చిన అల్ ఖైదా
- మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల ఫలితం
- నుపుర్ పై అల్ ఖైదా ఆగ్రహం
- ప్రతీకారం తప్పదని హెచ్చరిక
- ఆత్మరక్షణ జిహాద్ కు పిలుపునిచ్చిన ఉగ్రవాద సంస్థ
ఇప్పటికే పలు జిహాదీ సంస్థల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మ... తాజాగా అల్ ఖైదా హెచ్చరికతో మరింత ఆందోళనకర స్థితిలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె ఓ టీవీ చానల్లో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతర్జాతీయంగానూ భారత్ పై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో నుపుర్ శర్మను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది.
కాగా, నుపుర్ శర్మకు మద్దతు పలికినందుకే కన్హయ్య లాల్, ప్రతీక్ పవార్ అనే వ్యక్తులను హతమార్చిన వైనం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో, నుపుర్ శర్మ ప్రాణాలకు మరింత ముప్పు ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.