Chandrababu: 'ఎట్ హోమ్' లో చంద్రబాబు బృందం... సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన టీడీపీ!

Chandrababu and other TDP leaders attends At Home in Raj Bhavan
  • నేడు స్వాతంత్ర్య దినోత్సవం
  • ఏపీ రాజ్ భవన్ లో తేనీటి విందు
  • టీడీపీ నేతలకు ఆహ్వానం
  • సాదరంగా స్వాగతం పలికిన గవర్నర్
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విపక్ష నేత హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నేతలు హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

టీడీపీ బృందానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సాదరంగా స్వాగతించారు. టీడీపీ నేతలంతా ఒకే టేబుల్ వద్ద ఆసీనులయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Chandrababu
TDP
Raj Bhavan
Governor
Biswabhusan Harichandan

More Telugu News