ఇండియా పేరు మార్చాలంటూ మోదీని కోరిన క్రికెటర్ మహ్మద్ షమీ భార్య

15-08-2022 Mon 18:49
  • ఐ లవ్ భారత్ అన్న హసీన్ జహాన్
  • భారత్ లేదా హిందుస్థాన్ గా మార్చాలని విన్నపం
  • అందరినీ ఆకర్షిస్తున్న హసీన్ విన్నపం
Cricketer Shami wife requests Modi and Amit Shah to change india name to Bharat or Hindustan
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్ విబేధాల కారణంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హసీన్ జహాన్ చేసిన విన్నపం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'ఐ లవ్ భారత్' అని చెప్పిన ఆమె... మన దేశం పేరును భారత్ గా కానీ, హిందుస్థాన్ గా కానీ మార్చాలని మోదీ, అమిత్ షాలను ఆమె కోరారు. మన దేశం మనకు గర్వకారణమని చెప్పారు. దేశం వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో హసీన్ జహాన్ చేసిన ప్రతిపాదన అందరినీ ఆకర్షిస్తోంది.