మనవడితో కలిసి స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్న ముఖేశ్ అంబానీ

15-08-2022 Mon 13:11
  • దేశ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
  • తన నివాసంలో వేడుకలు జరుపుకున్న అంబానీ
  • భార్య నీతా, మనవడు పృథ్వీలతో కలిసి జెండాకు వందనం చేసిన ముఖేశ్
Mukhesh Ambani celebrates Independence day with family
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నేడు యావత్ దేశం స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను ఎగురవేసి, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ వేడుకలను జరుపుకుంటున్నారు. 

మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముంబైలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇండిపెండెన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీలతో కలిసి వేడుక చేసుకున్నారు. మనవడిని ముఖేశ్ ఎత్తుకోగా... నీతా అంబానీ మువ్వన్నెల పతాకాన్ని చేత పట్టుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ వీరు జాతీయ పతాకానికి వందనం చేశారు.