Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

Fight between BJP and TRS workers in Bandi Sanjay Padayatra
  • దేవరుప్పల మండలంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర
  • సంజయ్ ప్రసంగిస్తుండగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • ఘర్షణలో పలువురికి గాయాలు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవరుప్పలలో బండి సంజయ్ మాట్లాడుతూ... కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. 

దీంతో అక్కడున్న కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. దీంతో, రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
Bandi Sanjay
BJP
TRS
Fight

More Telugu News