వీల్ చెయిర్ లో ఉండి కూడా ఆనంద పారవశ్యంతో డ్యాన్స్ చేసిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా... వీడియో ఇదిగో!

14-08-2022 Sun 21:22
  • రాకేశ్ ఝున్ ఝున్ వాలా హఠాన్మరణం
  • విషాదంలో సన్నిహితులు
  • వీడియో పంచుకున్న కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్
Rakesh Jhunjhunwala dances in the wheel chair
ప్రముఖ ఇన్వెస్టర్, ఇండియన్ వారెన్ బఫెట్ గా ఖ్యాతిగాంచిన రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఆకస్మికంగా మరణించడం తెలిసిందే. ఆయన కొన్నిరోజుల కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అంతలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలాతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుని ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో, వీల్ చెయిర్ లో కూర్చున్న రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఎంతో హషారుగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. దీనిపై సంజయ్ నిరుపమ్ వివరణ ఇస్తూ, "రాకేశ్ ఝున్ ఝున్ వాలా రెండు కిడ్నీలు విఫలమయ్యాయి. డయాలసిస్ తప్పనిసరి అయింది. ఈ వీడియోలో ఆయన డ్యాన్స్ చేసిన తీరు చూస్తే బతకాలన్న కోరిక బలంగా కనిపించింది. మృత్యువు కూడా తన జీవనకాంక్ష ముందు అల్పమైనదేని ఈ వీడియో చెబుతోంది" అని పేర్కొన్నారు.