రజనీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిన తమన్నా!

13-08-2022 Sat 09:47
  • నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా   
  • సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న భారీ  చిత్రం 
  • 'జైలర్' పాత్రలో నటిస్తున్న రజనీకాంత్ 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న అనిరుధ్ 
Jailer Movie Update
రజనీకాంత్ కథానాయకుడిగా 'జైలర్' సినిమా రూపొందుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. 

ఇక హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ చేయవలసిన సమయం వచ్చేసింది. దాంతో ఈ సినిమా టీమ్ కొంతమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించి చివరికి తమన్నాను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. రజనీకాంత్ తో కలిసి నటించడమే తన డ్రీమ్ అని తమన్నా పలు సందర్భాల్లో చెప్పింది. ఈ సినిమాతో ఆమె ముచ్చట తీరనుందన్న మాట. రజనీ సరసన ఆమెను చూడాలనుకునే అభిమానుల కోరిక కూడా నెరవేరనుంది. 

'బాహుబలి 2' తరువాత తమన్నా జోరు ఒక రేంజ్ లో పెరుగుతుందని అనుకున్నారు. 'సైరా' సినిమా సమయంలోను అదే టాక్ వచ్చింది. కానీ ఎందుకనో పెద్ద సినిమాల్లో ఆమె కనిపించలేకపోయింది. రజనీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి, ఇది ఆమెకి ఆనందాన్ని కలిగించే విషయమే. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న సంగతి తెలిసిందే.