ఆమిర్ ఖాన్ ఇంటిపై ఎగిరిన మువ్వ‌న్నెల జెండా... ఫొటోలు ఇవిగో

12-08-2022 Fri 21:09
  • ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట భారీ కార్య‌క్ర‌మాల‌కు కేంద్రం పిలుపు
  • ఆగ‌స్టు 13 నుంచి 15 దాకా ఇళ్ల‌పై జాతీయ జెండాల‌ను ఎగ‌ర‌వేయాల‌న్న మోదీ
  • ఓ రోజు ముందుగానే స్పందించిన ఆమీర్ ఖాన్‌
  • త‌న ఇంటి బాల్కనీపై జాతీయ జెండాను ఎగుర‌వేసిన బాలీవుడ్ హీరో
Aamir khan hoist national flag on his house
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట కేంద్ర ప్ర‌భుత్వం భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని పౌరులంతా ఈ నెల 13 (శ‌నివారం) నుంచి 15 (సోమ‌వారం) వ‌ర‌కు త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాల‌ను ఎగుర‌వేయాలంటూ స్వ‌యంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్ర‌ధాని పిలుపున‌కు భారీ స్పంద‌న ల‌భిస్తోంది.

కేంద్రం ప్ర‌క‌ట‌న మేర‌కు ఓ రోజు ముందుగానే బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ స్పందించారు. త‌న నివాసంలోని బాల్కనీపై ఆయ‌న జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఆ జెండా ప‌క్క‌నే నిల‌బడి తీసుకున్న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.