40 కోట్లను కొల్లగొట్టిన 'సీతా రామం' 

12-08-2022 Fri 18:35
  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'సీతా రామం'
  • తెలుగు రాష్ట్రాలలో నిదానంగా పుంజుకున్న సినిమా
  • ఓవర్సీస్ లో లభిస్తున్న విశేషమైన ఆదరణ
  • వారం రోజుల్లో 40 కోట్ల గ్రాస్ వసూలు
Sita Ramam Movie Update
మలయాళంలో స్టార్ హీరోగా దుల్కర్ దూసుకుపోతున్నాడు. పదేళ్లలో ఆయన 35కి పైగా సినిమాలు చేశాడు. తెలుగు .. తమిళ ప్రేక్షకులకు మరింత చేరువయ్యే కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టి చాలాకాలమే అయింది. తెలుగులో నేరుగా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన 'సీతా రామం' కథను ఎంచుకున్నాడు. 

ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఒక వైపు ప్రేమ .. మరో వైపున యుద్ధం ఈ కథలో కలిసి నడుస్తాయి. ఒకరు దేశం కోసం ప్రేమను త్యాగం చేస్తే .. మరొకరు ప్రేమ కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఫస్టాఫ్ కాస్త స్లోగా నడిచిందనే టాక్ వచ్చింది. 

కానీ ఓవర్సీస్ విషయానికి వచ్చేసరికి ఈ విధమైన కథ నడక వాళ్లకి నచ్చింది. దాంతో అక్కడ ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం వలన ఈ సినిమా వసూళ్ల జోరు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి..