Raghu Rama Krishna Raju: సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

MP Ragurama Krishna Raju met President Of India Droupadi Murmu
  • రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన రఘురామ
  • ద్రౌపది ముర్ముతో భేటీ
  • ఆదర్శప్రాయురాలని కితాబు
  • మోదీ ఎంపిక అద్భుతం అంటూ ట్వీట్
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రఘురామ సతీసమేతంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. దీనిపై రఘురామ ట్వీట్ చేశారు. దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించినందుకు ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేసినట్టు వెల్లడించారు. ఆమె ఒక ఆదర్శప్రాయురాలైన మహిళ అని రఘురామ కీర్తించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో తీసుకున్న ఫొటోను కూడా పంచుకున్నారు.
Raghu Rama Krishna Raju
Droupadi Murmu
Rashtrapathi Bhavan
New Delhi
YSRCP

More Telugu News