తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాఖీ క‌ట్టిన ఆయ‌న సోద‌రీమ‌ణులు... వీడియో ఇదిగో

12-08-2022 Fri 17:31
  • ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన కేసీఆర్ సోద‌రీమ‌ణులు
  • ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు కేసీఆర్‌కు రాఖీ క‌ట్టిన వైనం
  • వేడుక‌లో పాల్గొన్న‌ కేసీఆర్ భార్య, కోడ‌లు, మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలు
రాఖీ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయ‌న సోద‌రీమ‌ణులు ఒకరి తర్వాత మరొకరు రాఖీలు క‌ట్టారు. సీఎం అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చిన న‌లుగురు సోద‌రీమ‌ణులు ఆయ‌న‌కు వ‌రుస‌గా రాఖీలు క‌ట్టారు. ఈ వేడుక‌లో కేసీఆర్ భార్యతో పాటు ఆయ‌న కోడ‌లు, మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలు కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్షుకు ఆయ‌న సోద‌రి కూడా రాఖీ క‌ట్టారు. ఈ వేడుక‌కు సంబంధించిన వీడియోను తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం (తెలంగాణ సీఎంఓ) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.