Himanshu: కల్వకుంట్ల హిమాన్షుకు రాఖీలు కట్టిన ప్రగతి భవన్ సిబ్బంది... ఫొటోలు ఇవిగో!

Pragathi Bhavan women staff ties Rakhis to Kalvakuntla Himanshu
  • ఘనంగా రక్షాబంధన్ పర్వదినం
  • ప్రగతి భవన్ లో వేడుకలు
  • పాల్గొన్న కేసీఆర్ కుటుంబ సభ్యులు
  • సోదరుడు హిమాన్షుకు రాఖీ కట్టిన అలేఖ్య
రాఖీ పండుగ సందర్భంగా ప్రగతి భవన్ లో సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో సీఎం కేసీఆర్, కల్వకుంట్ల కవిత, కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టి ఆశీస్సులు పొందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడే ఉన్నారు. అటు, ప్రగతిభవన్ లో పనిచేసే మహిళా సిబ్బంది కూడా హిమాన్షుకు రాఖీలు కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను హిమాన్షు సోషల్ మీడియాలో పంచుకున్నారు. హ్యాపీ రక్షాబంధన్ అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీలు కట్టినందుకు అలేఖ్యకు, ప్రగతి భవన్ లోని సోదరీమణులందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
Himanshu
Rakhi
Alekhya
Pragathi Bhavan
Women
KCR
KTR
K Kavitha
TRS
Telangana

More Telugu News