కన్నడ సినీ గాయకుడు శివమొగ్గ సుబ్బన్న మృతి
- నిన్న రాత్రి సుబ్బన్నకు గుండెపోటు
- బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
- ఆయన వయసు 83 సంవత్సరాలు
సుబ్బన్న వయసు 83 సంవత్సరాలు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. 'కాడు కుదురే' చిత్రంలో ఆయన పాడిన పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. తన కెరీర్లో ఆయన ఎన్నో అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. గతంలో ఆయన అడ్వొకేట్ గా కూడా పని చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.