రుషికొండ బీచ్ లో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు.. కలకలం!

  • నిన్న కొట్టుకొచ్చిన యువకుడి మృతదేహం
  • ఈ తెల్లవారుజామున కొట్టుకొచ్చిన యువతి డెడ్ బాడీ
  • యువకుడిది నంద్యాల, యువతిది విజయనగరంగా గుర్తింపు
Couple dead bodies found in Rushikonda beach

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ లో జంట మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. రుషికొండ సముద్ర తీరానికి నిన్న ఒక యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడిని నంద్యాలకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించారు. ఈ తెల్లవారుజామున యువతి డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. ఆమెను విజయనగరం జిల్లాకు చెందిన దివ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... వీరిద్దరి మృతి వెనుక కారణాలను అన్వేషిస్తున్నారు. వీరి మరణాల వెనుక ఏ కారణాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

More Telugu News