ఆనంద్ మ‌హీంద్రా ప్ర‌శ్న‌కు అదిరేటి ఆన్స‌రిచ్చిన కేటీఆర్ కుమారుడు హిమాన్షు

11-08-2022 Thu 18:42
  • సింహం ఫొటోను పోస్ట్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా
  • అన్నీ గ‌మ‌నిస్తున్నానంటూ సింహం చెబుతున్న‌ట్లుగా ట్వీట్‌
  • మీ ఇంటిలో ఇలాంటి వారెవ‌రంటూ మ‌హీంద్రా ప్ర‌శ్న‌
  • మా తాత గారేనంటూ ఆన్స‌రిచ్చిన కేసీఆర్ మ‌న‌వ‌డు
ktr son himanshu responds on anand mahindra tweet
సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా సంధించిన ఓ ప్ర‌శ్న‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల‌ హిమాన్షురావు స్పందించారు. గ‌తంలో మ‌హీంద్రా ట్వీట్ల‌కు కేటీఆర్ స్పందించ‌గా...తాజాగా మ‌హీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించ‌డం గ‌మ‌నార్హం.

అన్నింటినీ నిశితంగా ప‌రిశీలిస్తున్న ఓ సింహం ముఖం ఫొటోను పోస్ట్ చేసిన మ‌హీంద్రా... నేనేమీ రియాక్ట్ కాను. అయితే అన్నింటినీ నిశితంగా గమనిస్తానని న‌మ్ము అన్న వ్యాఖ్య‌ను సింహం చెబుతున్న‌ట్లుగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా మీ ఇంటిలో ఈ త‌ర‌హా కేట‌గిరీ వ్య‌క్తి ఎవ‌రంటూ మ‌హీంద్రా ప్ర‌శ్న‌ను సంధించారు. ఈ ట్వీట్‌కు స్పందించిన హిమాన్షు... 'మా ఇంటిలో అయితే మా తాత గారు (తెలంగాణ సీఎం కేసీఆర్‌)' అంటూ బ‌దులిచ్చారు.