వైసీపీ నేత క్రాంతికుమార్ రెడ్డి మద్యం తాగి మహిళా ఉద్యోగులను దుర్భాషలాడటం దారుణం: నారా లోకేశ్
- మహిళా ఉద్యోగులపై వైసీపీ నేత క్రాంతి కుమార్ రెడ్డి దుర్భాషలాడారన్న లోకేశ్
- వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ అగ్ర నేత
- తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లిలో ఘటన
- రాఖీ సందర్భంగానైనా జగన్ ఆలోచన ధోరణిలో మార్పు రావాలని ఆకాంక్ష
మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన క్రాంతి కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకొని ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. రాఖీ పండుగ సందర్భంగానైనా జగన్ రెడ్డి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి మహిళలకు న్యాయం చెయ్యాలని ఆశిస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు.
ఒక్క మాధవ్ పైనైనా చర్యలు తీసుకుంటే వైసీపీలో రోజుకో మాధవ్ పుట్టుకు రావడం తగ్గుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. న్యూడ్ వీడియోలతో మహిళల్ని వేధిస్తున్న మాధవ్ లాంటి వారిపై చర్యలు తీసుకోకపోగా, అలాంటి వారిని ప్రభుత్వమే వెనకేసుకురావడం వలనే మహిళలకు వేధింపులు పెరిగిపోతున్నాయని లోకేశ్ అభిప్రాయపడ్దారు.