మలైకాను పెళ్లి చేసుకోవడంపై అర్జున్ కపూర్ స్పందన

11-08-2022 Thu 15:23
  • ప్రేమలో మునిగి తేలుతున్న అర్జున్ కపూర్, మలైకా అరోరా
  • ఇప్పుడే పెళ్లికి సిద్ధంగా లేమన్న అర్జున్ కపూర్
  • కెరీర్ పై దృష్టి సారించాలనుకుంటున్నానని వ్యాఖ్య
Arjun Kapoor response on marriage with Malaika Arora
బాలీవుడ్ యాక్టర్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న వెంటనే అర్జున్ తో మలైకా డేటింగ్ చేయడం ప్రారంభించింది. సినిమాల కంటే కూడా ప్రేమ వ్యవహారంతోనే వీరిద్దరూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

అయితే 'కాఫీ విత్ కరణ్' షోకి గెస్ట్ గా వచ్చిన అర్జున్ కపూర్ ఈ వ్యవహారంపై బాంబు పేల్చాడు. ఈ షోలో మలైకాతో అఫైర్, పెళ్లిపై ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. తాను, మలైకా ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేమని ఈ సందర్భంగా అర్జున్ చెప్పాడు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లు సినిమాలు లేకుండానే గడిచిపోయాయని... ఇప్పుడు తాను కెరీర్ పై దృష్టి సారించాలనుకుంటున్నానని తెలిపాడు. తన పని తనకు సంతోషాన్ని ఇస్తుందని... తాను సంతోషంగా ఉన్నప్పుడే తన భాగస్వామిని సంతోషపెట్టగలనని చెప్పాడు. ఇప్పటికైతే పెళ్లి ఆలోచనలు లేవని స్పష్టం చేశాడు.