విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలపై.. రానా భార్య స్పందన

11-08-2022 Thu 14:30
  • రానా, మిహీకా బజాజ్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం
  • ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టిన మిహీకా
  • సెకండ్ యానివర్సరీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం
Actor Rana wife response on divorce
సినీ నటుడు రానా, ఆయన భార్య మిహీకా బజాజ్ లు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని... అందుకే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారంటూ రూమర్లు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాకు తాను దూరం కాబోతున్నానని రానా చెప్పడం... ఇన్స్టాగ్రామ్ లో పోస్టులను తొలగించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. 

ఈ నేపథ్యంలో, ఈ ప్రచారానికి మిహీకా బజాజ్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ వార్తలకు చెక్ పెడుతూ... తమ సెకండ్ యానివర్సరీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో, తాము విడాకులు తీసుకోవడం లేదనే వార్తను ఆమె చెప్పకనే చెప్పినట్టయింది.