DJ Tillu: డీజే టిల్లు పాట‌కు కాలు క‌ద‌ప‌కుండానే స్టెప్పులేసిన మంత్రి త‌ల‌సాని... వీడియో ఇదిగో

ts minister talasani srinivas yadav dance to dj tillu song
  • స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ర‌న్‌
  • రన్‌ను ప్రారంభించేందుకు వ‌చ్చిన మంత్రి త‌ల‌సాని
  • వామ‌ప్ కోస‌మంటూ డిజే టిల్లు పాట‌ను ప్లే చేసిన నిర్వాహ‌కులు
  • చేతులు ఊపుతూ ఉత్సాహంగా క‌నిపించిన మంత్రి
ఇటీవ‌ల విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన డీజే టిల్లు టైటిల్ సాంగ్ విన‌బ‌డిందంటే... ఊపు రాని వారు అరుదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో గురువారం హైదారాబాద్‌లో ర‌న్‌లో భాగంగా రికార్డయిన ఓ వీడియోను చూస్తే ఈ మాట నిజ‌మేనని ఒప్పుకోవాల్సిందే. ఈ ర‌న్‌ను తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ర‌న్ ప్రారంభానికి ముందు వామ‌ప్ కోస‌మంటూ నిర్వాహ‌కులు డీజే టిల్లు సాంగ్‌ను ప్లే చేశారు. 

ఈ పాట మొద‌లు కాగానే... సాధార‌ణ పౌరుల‌తో పాటు ర‌న్‌కు హాజ‌రైన ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఉత్సాహంగా పాట‌కు అనుగుణంగా స్టెప్పులేయ‌డం మొద‌లెట్టారు. వారిని చూసిన మంత్రి త‌ల‌సాని కూడా చేతులు ఊపుతూ ఉల్లాసంగా క‌నిపించారు. అయితే కాలు ఏమాత్రం క‌ద‌ప‌కుండానే... ఉన్న చోటునే నిల‌బ‌డి త‌ల‌సాని ఈ పాట‌కు స్టెప్పులేయ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.
DJ Tillu
Telangana
Hyderabad
75YearsofIndependence
TRS
Talasani

More Telugu News