గోరంట్ల మాధ‌వ్ వీడియోపై ప్ర‌ధాని, లోక్ స‌భ స్పీక‌ర్‌, మ‌హిళా క‌మిష‌న్‌ల‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ

11-08-2022 Thu 14:19
  • మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా గోరంట్ల‌పై ఆరోప‌ణ‌లు
  • వీడియోపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్‌
  • ఈ వీడియో ఎంపీల‌కు మాయ‌ని మ‌చ్చ‌గా ఉంద‌ని ఆరోప‌ణ‌
confress mp Jasbir Singh Gill complaints pm narendra modi and lok sabha speaker and ncw chairperson over ysrcp mp gorantla madhav video
ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న‌ట్లుగా ఉన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వ్య‌వ‌హారంపై గురువారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ వీడియోపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, లోక్ స‌భ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌కు ఫిర్యాదు అందింది. కాంగ్రెస్ పార్టీ నేత‌, పంజాబ్‌లోని ఖ‌దూర్ సాహిబ్ పార్ల‌మెంటు స‌భ్యుడు జ‌స్బీర్ సింగ్ గిల్‌ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో వ్య‌వ‌హారం పార్ల‌మెంటు స‌భ్యుల‌కు మాయ‌ని మ‌చ్చ‌గా ఉంద‌ని ఆయ‌న త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఈ వీడియోపై త‌క్ష‌ణ‌మే దృష్టి సారించి బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో ప్ర‌ధాని, స్పీక‌ర్‌, జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌ల‌ను కోరారు.