వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం

11-08-2022 Thu 14:13
  • ఒక ఫంక్షన్ కోసం కర్నూలుకు వచ్చిన విజయమ్మ
  • తిరిగి వెళ్తుండగా పేలిపోయిన కారు టైర్లు
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయమ్మ
YS Vijayamma escaped from accident
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. ఒక ఫంక్షన్ కు హాజరు కావడానికి ఆమె కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గుత్తి దగ్గర కారు టైర్లు పేలిపోయి ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె వేరే కారులో వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.