రాఖీ కట్టించుకోవడమే కాదు.. రక్షగా నిలుస్తామని మాటివ్వాలి: చిరంజీవి

11-08-2022 Thu 13:00
  • రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
  • భోళా శంకర్ నుంచి వీడియోను విడుదల చేసిన చిత్ర బృందం
  • చిరుకు రాఖీ కట్టిన కీర్తి సురేశ్
Chiranjeevi wishes on Rakhi
మెగాస్టార్ చిరంజీవి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ కట్టించుకోవటమే కాదు.. రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకి మాటివ్వాలి అని ట్వీట్ చేశారు. మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్ర బృందం రాఖీ పండుగ కానుకను చిరు అభిమానులకు అందించింది. ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా నటిస్తున్న కీర్తి సురేశ్ ఆయనకు బొట్టు పెట్టి రాఖీ కడుతున్న వీడియోను విడుదల చేసింది. 

‘ప్రతి తెలుగు ఇంటి ఆరాధ్యుడు. వెన్నంటి ఉండే అందరివాడు. మన భోళా శంకరుడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ‘భోళా శంకర్’ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క, ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలోనూ నటిస్తున్నారు. లూసిఫర్ కు రిమేక్ గా వస్తున్న ఈ చిత్రం దసరాకు విడుదలకానుంది.